తెలంగాణ

గండ్రవాణిగూడెంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

గండ్రవాణిగూడెంలో ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం

దుర్గామాత మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నదాన సేవ

జనం న్యూస్ అక్టోబర్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గండ్రవాణిగూడెం: గ్రామంలో దుర్గామాత అమ్మవారి మండపం వద్ద సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, భవానీ స్వాములు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొబ్బలి కావ్య, మాజీ ఉపసర్పంచ్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, మాధవ రెడ్డి, సతీష్ రెడ్డితో పాటు భవానీ స్వాములు శ్రీనివాస్ రెడ్డి, సాయి, గిరి, శేఖర్, రాము, నవదీప్, శివ, అనిల్, రిత్విక్, ఋషికేశ్, మల్లేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.అన్నదానం మహాదానమనే భావనతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది. భక్తులకు అన్నప్రసాదం అందిస్తూ సేవాభావాన్ని చాటుకున్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు గ్రామంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని గ్రామస్తులు పేర్కొన్నారు.

ఇ-పేపర్