జనం న్యూస్ 19 అక్టోబర్ వికారాబాద్ జిల్లా :- పరిగి మండలం రాపోల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గండు వెంకటేష్ తండ్రి గండు అంతయ్య మృతి చెందడంతో సోమవారం పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు వారి నివాసానికి చేరుకుని ఆయన భౌతికకాయానికి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి, TGSRTC TJMU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడ్వకేట్ ఆనంద్ గౌడ్, పరిగి టౌన్ మాజీ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ తదితరులు అంతయ్య పార్థివ దేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ… అంతయ్య మరణం వారి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, శోకతప్త హృదయాలతో ఉన్న కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గండు రవి, గండు రాంచెంద్రయ్య, కుర్వ హన్మయ్య, ఎర్రవాన్ల రవి, వార్డ్ మెంబర్ రాములు, గండు అశోక్ తదితరులు పాల్గొని అంతయ్యకు నివాళులర్పించారు.