తెలంగాణ

పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పరిగి మాజీ ఎమ్మెల్యే

పండుగ సాయన్న జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన పరిగి మాజీ ఎమ్మెల్యే

జనం న్యూస్ అక్టోబర్ 22, తెలంగాణ ఆత్మగౌరవ పోరాట యోధుడు, పేదల పెన్నిధి శ్రీ పండుగ సాయన్న ముదిరాజ్ 174వ జయంతి సందర్భంగా పరిగి పట్టణంలో ఆయన విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి స్థానిక నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, పండుగ సాయన్న పేదలందరి నాయకుడని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి ఆయన ప్రతీకగా నిలిచారని అన్నారు.పేదల హక్కుల కోసం,సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. పండుగ సాయన్న ఆశయాలను స్మరించుకుంటూ, సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎం పి పి అరవింద్ రావ్, మార్కెట్ కమిటీ చెర్మన్ సురేందర్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, కౌన్సిలర్ లు తాహేర్, రవి,తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్