ఆంధ్రప్రదేశ్

25వ వార్డు వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ స్వచ్ఛందమే: చిక్కాల స్పష్టీకరణ

25వ వార్డు వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ స్వచ్ఛందమే: చిక్కాల స్పష్టీకరణ

జనం న్యూస్, అక్టోబర్ 22: అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 25వ వార్డు వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ తీవ్రంగా ఖండించారు. 25వ వార్డు వైసీపీ అభ్యర్థి కురసాల వీరభద్రరావు తన సొంత నిర్ణయంతోనే నామినేషన్ ఉపసంహరించుకున్నారని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిక్కాల గణేష్ మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థి కురసాల వీరభద్రరావు స్వయంగా వచ్చి ఎన్నికల అధికారికి విత్ డ్రా ఫారంను సమర్పించారన్నారు. అప్పటికే పినిపే శ్రీకాంత్ తన అనుచరులతో మున్సిపల్ కార్యాలయంలో ఉన్నారని, వారి ముందే నిబంధనల ప్రకారం విత్ డ్రా ప్రక్రియ జరిగిందని తెలిపారు. ఈ విషయం తెలిసి కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడటం సరికాదన్నారు. పోలీసుల సహకారంతో విత్ డ్రా జరిగిందని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల అధికారుల సమక్షంలో చట్ట ప్రకారం జరిగిన ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తూ తండ్రీ కొడుకులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 2020లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో అనేక వార్డులను బెదిరించి ఏకగ్రీవం చేసుకున్న విషయం ప్రజలందరికీ తెలుసునని గుర్తు చేశారు. తాము అనుకుంటే సగానికి పైగా వార్డులు ఏకగ్రీవం చేసుకునే అవకాశం ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ అలా చేయలేదని చిక్కాల గణేష్ పేర్కొన్నారు.*

ఇ-పేపర్