తెలంగాణ

తాళ్లరాంపూర్‌లో వైభవంగా అమ్మవారి నిమజ్జనంభక్తి పాటలు, బతుకమ్మ పాటలతో మహిళల ఊరేగింపు

తాళ్లరాంపూర్‌లో వైభవంగా అమ్మవారి నిమజ్జనంభక్తి పాటలు, బతుకమ్మ పాటలతో మహిళల ఊరేగింపు

జనం న్యూస్, అక్టోబర్ 20: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో శక్తి సేనా సమితి ఆధ్వర్యంలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని మంగళవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. మహిళలు భక్తి గీతాలు, బతుకమ్మ పాటలు ఆలపిస్తూ మంగళహారతులతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం హనుమాన్ ఆలయం వద్ద నరకాసుర వధ ఘట్టాన్ని నిర్వహించి, అమ్మవారి విగ్రహాన్ని శ్రీరామ చెరువులో నిమజ్జనం చేస్తారు.ఈ సందర్భంగా శక్తి సేనా సమితి అధ్యక్షుడు, ఇంచార్జి సర్పంచ్ చాట్ల జనార్ధన్ మాట్లాడుతూ, తొమ్మిది రోజులపాటు పూజారి దోమకొండ అనురాధ పంతులు వేదమంత్రాలతో నిర్వహించిన ప్రత్యేక పూజలు గ్రామ ప్రజలను, సమితి సభ్యులను భక్తిపారవశ్యంలో ముంచెత్తాయని తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనురాధ పంతులుకు సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే తొమ్మిది రోజులపాటు నిర్వహించిన అమ్మవారి ఉత్సవాలకు గ్రామ ప్రజలు అందించిన సహకారం, మద్దతు మరువలేనివని జనార్ధన్ పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన గ్రామ ప్రజలందరికీ శక్తి సేనా సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ ఏడాది అమ్మవారి విగ్రహ దాతగా ఆడెము నగేష్ -లాస్య వ్యవహరించారని జనార్ధన్ వెల్లడించారు. 2029 సంవత్సరం వరకు అమ్మవారి విగ్రహ దాతల పేర్ల నమోదు పూర్తయిందని, 2030 సంవత్సరం నుంచి విగ్రహ దాతలుగా సేవ చేయదలచిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.భక్తుల సహకారంతో అమ్మవారి ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని ఆయన పేర్కొన్నారు.

ఇ-పేపర్