తెలంగాణ

గ్రంథాలయాల ద్వారా సాహిత్య పుస్తకాలు కొనుగోలు చేయాలి

గ్రంథాలయాల ద్వారా సాహిత్య పుస్తకాలు కొనుగోలు చేయాలి
జనం న్యూస్ : 22 అక్టోబర్ గురువారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్  ప్రభుత్వం వెంటనే గ్రంథాలయాల ద్వారా రచయితల సాహిత్య పుస్తకాలు కొనుగోలు చేయాలని జాతీయ సాహిత్య పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఐతా చంద్రయ్య అన్నారు. సిద్దిపేట మహాత్మాగాందీ పార్క్ లో గురువారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఐతా చంద్రయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రచయితల పుస్తకాలు జిల్లా గ్రంధాలయ సంస్థల ద్వారా కొనుగోలు చేసేవారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి గ్రంథాలయాల ద్వారా పుస్తకాల కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని రచయితల పుస్తకాలు కొనుగోలు చేసి, జిల్లా గ్రంధాలయాలతో పాటుగా పాఠశాల గ్రంధాలయాల్లో కూడా సాహిత్య పుస్తకాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ రచయితలకు పురస్కారాలు ఇవ్వకపోవడం ఏమిటంటూ, తెలంగాణ రచయితలకు రాబోయే రోజుల్లో తప్పకుండా తెలంగాణ ప్రాంతంలో ఇచ్చే ప్రతి పురస్కారం తెలంగాణ రచయితలకే ఇవ్వాలని జాసాప కవులు కోరారు. కార్యక్రమంలో జాసాప అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, గజ్జెల కనకరాజు, బస్వ రాజ్ కుమార్, వరుకోలు లక్ష్మయ్య ఎడ్ల లక్ష్మి, అనిశెట్టి సతీష్ కుమార్, కాల్వ రాజయ్య, చీకోటి రాములు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్