జనం న్యూస్ అక్టోబర్ 23 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి స్థానిక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది అనకాపల్లి పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు మాజీ నూకాంబిక దేవస్థానం చైర్మన్ జార్జ్ క్లబ్ అధ్యక్షుడు కొణతాల మురళీకృష్ణ తన మిత్ర బృందంతో కలిసి జనసేన పార్టీలో చేరారు. అనకాపల్లిలో చోటు చేసుకున్న ఈ రాజకీయ చేరిక స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సమక్షంలో కొణతాల మురళి జనసేన పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు