వైరల్ వార్తలు

మున్నూరు కాపు భవనానికి మరో ఐదు కోట్లు కేటాయిస్తాం

మున్నూరు కాపు భవనానికి మరో ఐదు కోట్లు కేటాయిస్తాం

జనం న్యూస్ అక్టోబర్ 30 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ఆయా కులాల్లో సంపన్నులుగా ఎదిగిన వారు కుల భవనాల నిర్మాణానికి, పేదల విద్యా, ఉద్యోగ అభివృద్ధికి తోడ్పడాలని బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మాత్యులు పొన్న ప్రభాకర్, అన్నారు. గురువారం ఉదయం జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే ఎంపీ కాలనీ క్లబ్ లో జరిగిన మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనానికి ఐదు కోట్ల నిధులు కేటాయించి ప్రొసీడింగ్ అందజేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొందరగా భవన నిర్మాణ పనులు చేపట్టాలని త్వరలోనే మరో ఐదు కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ ఆదీ శ్రీనివాస్, మాట్లాడుతూ కుల పెద్దలు కలిసికట్టుగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం కేటాయించిన నిదులతో పాటు కులస్తులు కూడా విరాళాలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్, మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కి 20 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని నిధులు మంజూరయ్యాలా చేయాలని విజ్ఞప్తి చేశారు. బిసి కమిషన్ చైర్ పర్సన్ బాలలక్ష్మి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఎం ఎల్సి దండే విట్టల్, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమవారం సత్యనారాయణ, డాక్టర్ పుంజాల వినయ్,రాష్ట్ర అధ్యక్షులు పుట్ట పురుషోత్తం రావు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు గాలి అనిల్ కుమార్, రౌతు కనకయ్య, మంగళారపు లక్ష్మణ్, సత్తు మల్లేశం, గ్లోబల్ మున్నూరు కాపు అడ్వైజర్ సంఘాని రజనీకాంత్,బుక్క వేణుగోపాల్,,జె ఎన్ వెంకట్, మిద్దెల జితేందర్, మణికొండ వెంకటేశ్వరరావు,ఎడ్ల రవి, బండి పద్మ, ఈసంపల్లి వెంకన్న, కె ఎస్ ఆనంద్, ఆయా సంఘాల ప్రతినిధులు పలువురు మున్నూరు కాపు పెద్దలు అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

ఇ-పేపర్