తెలంగాణ

కాలనీ ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం.రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు

కాలనీ ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యం.రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్యక్రమాలు

జనం న్యూస్ అక్టోబర్ 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పారిశుధ్యానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వాటర్ బోర్డు అధికారులు నాగరాజు, సతీష్ అందించిన గోడపత్రికలను కాలనీలోని పలు ప్రాంతాల్లో అతికించారు. వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు అవసరమైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.అదేవిధంగా, ఇటీవల డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసిన అనంతరం అక్కడ పేరుకుపోయిన మట్టి కుప్పలను పూర్తిగా తొలగించి పరిసరాలను శుభ్రం చేయించారు. కాలనీలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టడం పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి, కార్యదర్శి ఆర్. రామచంద్రరావు, శ్రీధర్, లక్ష్మీనారాయణ, నాని తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. కాలనీవాసులకు ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకువస్తే, సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కాలనీ అభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన అవగాహన కార్యక్రమాలే లక్ష్యంగా అసోసియేషన్ నిరంతరం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఇ-పేపర్