తెలంగాణ

ఓటు హక్కు వినియోగానికి మూడు గంటల సమయం ఇస్తారా? ప్రైవేట్ సంస్థల తీరుపై స్థానికుల్లో చర్చ

ఓటు హక్కు వినియోగానికి మూడు గంటల సమయం ఇస్తారా? ప్రైవేట్ సంస్థల తీరుపై స్థానికుల్లో చర్చ

జనం న్యూస్, నవంబర్ 03,అచ్యుతాపురం : నవంబర్ 5వ తేదీన జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజాప్రాతినిధ్య చట్టం–1951లోని సెక్షన్ 135బి ప్రకారం పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు కల్పించాల్సి ఉంటుంది.ఏదైనా వ్యాపార సంస్థ,పరిశ్రమ,దుకాణం లేదా ప్రైవేట్,ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ ఓటు హక్కు కలిగిన ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుంది. అత్యవసర సేవలు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో పూర్తి రోజు సెలవు ఇవ్వడం సాధ్యం కాకపోతే, ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా కనీసం మూడు గంటల సమయం కల్పించాలనే నిబంధనలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంది.అయితే ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నప్పటికీ పరిశ్రమలు, దుకాణాలు, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు వాటిని ఎంతవరకు అమలు చేస్తాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ముఖ్యంగా కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు. నిబంధనలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలవుతాయా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.

ఇ-పేపర్