జనం న్యూస్ 3 నవంబర్ శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆదేశానుసారం…శాయంపేట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి రామస్వామి నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి.చేయాలని పిలుపునిచ్చారు
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు విసుగెత్తిపోయారు కావున పట్టభద్రులకు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను వివరించి మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇదే తొలిమెట్టుగా మళ్లీ కేసీఆర్ ను గెలిపిస్తారు. అని అన్నారు ముఖ్యంగా మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న పట్టభద్రులను గుర్తించి, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరి వివరాలను సేకరించాలని సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియపై పట్టభద్రులకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకునేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు అత్యంత కీలకమని, కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఇప్పటి నుంచే గ్రామాల వారీగా కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని తెలిపారు.ప్రతి గ్రామానికి ప్రత్యేక బాధ్యులను నియమించుకుని, యువ నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, పట్టభద్రుల సమస్యలను తెలుసుకుంటూ వారికి అండగా నిలవాలని తెలియజేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రామస్వామి నాయక్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.