తెలంగాణ

భరత్ నగర్ కాలనీలో ‘వన్ వార్డు – వన్ డే’ కార్యక్రమం.కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

భరత్ నగర్ కాలనీలో ‘వన్ వార్డు – వన్ డే’ కార్యక్రమం.కాలనీ సమస్యలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ నవంబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేసిన కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలోని భరత్ నగర్ కాలనీలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వన్ వార్డు – వన్ డే’ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న స్థానిక సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, కమిటీ సభ్యులు, స్థానిక కాలనీవాసులు అధికారులతో మాట్లాడి కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు. గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు, ఇచ్చిన హామీలు, ప్రస్తుతం పరిష్కారం కావాల్సిన అంశాలను ప్రస్తావిస్తూ వాటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటికి ప్రాధాన్యత క్రమంలో పరిష్కార మార్గాలు చూపాలని సంక్షేమ సంఘం సభ్యులు అధికారులను కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించడం ద్వారా వాటి పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.ఈ మేరకు కాలనీలో నెలకొన్న సమస్యలను వివరిస్తూ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ప్రజల సమస్యలను సంబంధిత అధికారులు పరిగణనలోకి తీసుకొని, పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి. నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు నాగేశ్వర్ రావు, సలహాదారు రత్నారావు, వెంకటేశ్వర్లు, మూర్తి, బాబు, నరేష్, వెంకటేష్ యాదవ్, బుచ్చిబాబు, డేవిడ్, రాంబాబు, కృష్ణ, వేణుగోపాల్, రాజు, అమృత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్