జ నం న్యూస్ నవంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కెపిహెచ్బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానలో ఎదురవుతున్న తీవ్ర ఆరోగ్య సమస్యలు, వైద్య సేవల లోపంపై స్థానిక ప్రజలు మరియు జనసేన నాయకులు ఆళ్ల నరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేడు కూకట్పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ కొల్లా శంకర్, జనసైనికులతో కలిసి బస్తీ దవాఖానను నేరుగా సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా దవాఖానలోని సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న పరిస్థితులను ఆరా తీశారు. గత 4 నెలలుగా దవాఖానలో డాక్టర్ లేకపోవడం, అలాగే సబ్-నర్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారు. ఈ సందర్భంగా కొల్లా శంకర్ మాట్లాడుతూ: “ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాల్సిన బస్తీ దవాఖానలో గత నాలుగు నెలలుగా వైద్యులు లేకపోవడం, అత్యవసర పరిస్థితిలో ప్రధమ చికిత్స చేసే స్థాయి సిబ్బంది కూడా లేకపోవడం విచారకరమని తెలియజేసారు. వైద్య వృత్తిపై అవగాహన లేని ఒక మహిళను దావఖానాలో సహాయ సిబ్బందిగా పెట్టుకోవడం బాధాకరమని తెలియజేసారు. పేద ప్రజల ఆరోగ్య విషయంలో అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యంపై ఆగ్రహిస్తూ అధికారులు తక్షణమే స్పందించి కెపిహెచ్బి 4వ ఫేజ్ బస్తీ దవాఖానకు పూర్తి స్థాయి డాక్టర్‌ను మరియు సబ్-నర్స్‌ను నియమించి, ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తేకపోతే జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేసారు .”ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్ గోవింద, పాదం సూర్య, నీరజ్ కుమార్, గోపికృష్ణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.