వైరల్ వార్తలు

తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

తర్లుపాడు మండలం జగన్నాధపురం ప్రాథమిక పాఠశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 31. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు జగన్ మాట్లాడుతూ భారతదేశానికి మొదటి ఉప ప్రధాని మరియు హోం మంత్రిగా పనిచేసిన ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు వల్లభాయ్ పటేల్ ఈయన గుజరాత్ లోని నడియాడలో జన్మించారు. 1875, అక్టోబర్ 31వ తేదీన జవేరా భాయ్ పటేల్ మరియు లాడ్ బెన్ పటేళ్లకు జన్మించారు. ఈయన చదువు పూర్తి అయిన తర్వాత మొదటగా లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. 1930లో గాంధీ చేపట్టిన ఉప్పు సత్యాగ్రహ దీక్షలో కీలకంగా వ్యవహరించారు. భార్దోలి సత్యాగ్రహం విజయవంతం తర్వాత అక్కడి మహిళలు ఆయనకు ‘సర్దార్'( నాయకుడు) అనే బిరుదును ఇచ్చారు. భారత జాతీయ కాంగ్రెస్ లో అత్యున్నత స్థాయి నాయకుడిగా పేరు సేవలందించారు. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయిన భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకురావడంలో పటేల్ అద్భుతమైన ఊహాన్ని ప్రదర్శించారు. దేశంలోని 560 పైగా సంస్థానాలను భారత యూనియన్ లో విజయవంతంగా విలీనం చేశారు. అందుకే ఆయన అందరూ ఉక్కుమనిషిగా పిలిచేవారు. 1950 డిసెంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచారు. మరణాంతరం 1991లో భారత దేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఆయనకు లభించింది. పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31 తేదీన ప్రత్యేక భారత దేశంలో ఐక్యతా దినోత్సవం జరుపుకుంటారు. గుజరాత్లో ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైనది. ఈ విధంగా భారతదేశానికి ఆయన చేసిన కృషిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఎం అనూష పాల్గొన్నారు.

ఇ-పేపర్