తెలంగాణ

అంబరాన్నంటిన ఎల్‌ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వీడ్కోలు వేడుకలుఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా ఎల్‌ఐసీపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరదు: రామ శర్మ

అంబరాన్నంటిన ఎల్‌ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ వీడ్కోలు వేడుకలుఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా ఎల్‌ఐసీపై ప్రజల విశ్వాసం చెక్కుచెదరదు: రామ శర్మ

జనం న్యూస్ – అక్టోబర్ 31, జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి: మెట్‌పల్లి ఎల్‌ఐసీ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కే. వి రామ శర్మ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. 40 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సేవలందించిన ఆయన పదవీ విరమణ మెట్‌పల్లి ఎల్‌ఐసీ శాఖ చరిత్రలోసీనియర్ బ్రాంచ్ మేనేజర్ గా తొలి సంఘటన కావడంతో పలువురు అధికారులు, డెవలప్‌మెంట్ అధికారులు, ఏజెంట్లు, సిబ్బంది ఘనంగా సత్కరించి తమ అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగాకే వి రామ శర్మ భావోద్వేగంతో మాట్లాడుతూ.. తన ఉద్యోగ జీవితంలో డెవలప్‌మెంట్ అధికారులు, ఏజెంట్లు, సిబ్బంది అందించిన ప్రోత్సాహం, సహకారం మరువలేనివని, మెట్‌పల్లి శాఖతో తనకున్న అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. ప్రైవేటు బీమా సంస్థలు వస్తుంటాయి, పోతుంటాయని, వాటిని చూసి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రాక ఎప్పుడూ తగ్గనట్లే, ఎన్ని ప్రైవేటు సంస్థలు వచ్చినా ఎల్‌ఐసీపై ప్రజల విశ్వాసం తగ్గదని ఉదాహరణతో వివరించారు. అసిస్టెంట్ స్థాయి నుంచి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదగడానికి ఎల్‌ఐసీ సంస్థే కారణమని, తన పిల్లల చదువులు, వివాహాలు, కుటుంబ అభివృద్ధికి సంస్థ ఎంతో తోడ్పడిందని పేర్కొన్నారు.కోరుట్ల బ్రాంచ్ మేనేజర్ మోహనకృష్ణ మాట్లాడుతూ.. తామిద్దరూ ఒకేసారి బ్రాంచ్ మేనేజర్లుగా బాధ్యతలు చేపట్టామని, మెట్‌పల్లి, కోరుట్ల శాఖలను ఒకే కుటుంబంలా భావించి రెండు శాఖల అభివృద్ధికి రామ శర్మ ఎంతో సహకరించారని తెలిపారు. తనకు పెద్దన్నయ్యలా అండగా నిలిచిన ఆయన పదవీ విరమణ చేయడం బాధాకరమని భావోద్వేగంతో పేర్కొన్నారు.మెట్‌పల్లి బ్రాంచ్ మేనేజర్ రామ్‌కిషన్ మాట్లాడుతూ.. రామ శర్మ గారి ముఖంలో ఎప్పుడూ కోపం చూడలేదని, చిరునవ్వే కనిపించేదని అన్నారు. తాను కొన్నిసార్లు కొంచెం గట్టిగా మాట్లాడినా ఆయన చిరునవ్వుతోనే సమాధానం ఇచ్చేవారని గుర్తుచేసుకున్నారు. మెట్‌పల్లికి బదిలీపై వచ్చి నేను రెండు నెలలకుపైగా మాత్రమే అవుతున్నప్పటికీ, ఈ కొద్దికాలంలోనే ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయన అపారమైన తెలివితేటలు, అనుభవం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. ఇంతలోనే ఆయన పదవీ విరమణ చేయడం తనకు ఎంతో బాధాకరమని తెలిపారు.ఈ కార్యక్రమం లోవికాశ అధికారులు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, సిబ్బంది ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అభినందనలు తెలిపారు. 40 ఏళ్లకు పైగా అంకితభావంతో సేవలందించి అందరి అభిమానాన్ని సంపాదించుకున్న రామ శర్మ వీడ్కోలు వేడుక మెట్‌పల్లి ఎల్‌ఐసీ శాఖలో చిరస్మరణీయంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.

ఇ-పేపర్