తెలంగాణ

రేణుక ఎల్లమ్మ ఆలయంలో గంట చోరీ పోలీసులకు గ్రామస్తుల విజ్ఞప్తి

రేణుక ఎల్లమ్మ ఆలయంలో గంట చోరీ పోలీసులకు గ్రామస్తుల విజ్ఞప్తి

జనం న్యూస్ 30 అక్టోబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )హన్మకొండ జిల్లా, ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వీరనారాయణపురం గ్రామంలో ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ మండపంలో ఉన్న గంటను దొంగిలించినట్లు గ్రామస్తులు తెలిపారు సుమారు 7500 విలువ ఉంటుందని అన్నారు శుక్రవారం ఉదయం గౌడ కులస్తులు ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్లగా గంట కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో ఆలయంలోని గంట చోరీకి గురైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మండలంలోని పలు గ్రామాల్లో దేవాలయాలు, గుళ్లు, ఇతర ప్రార్థనా స్థలాల్లో కూడా చోరీ ఘటనలు జరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు గౌడ సంఘం అధ్యక్షుడు మండ సారంగం మాట్లాడుతూదేవాలయాల్లో ఇలాంటి దొంగతనాలు పునరావృతం కాకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని, ఆలయాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయాల ఆస్తులను, దేవతా విగ్రహాలను, గంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పోలీసులను విజ్ఞప్తి చేశారు

ఇ-పేపర్