తెలంగాణ

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన: ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో ఆందోళన

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన: ఐదు రోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా నల్ల బ్యాడ్జీలతో ఆందోళన

జనం న్యూస్ 31 అక్టోబర్ 2026(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) ఎల్కతుర్తి మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయులు శనివారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు మోడల్ స్కూల్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకుTG TEAM ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆఫ్ మోడల్ స్కూల్స్ రాష్ట్ర అధ్యక్షులు రేచవేని కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ మోడల్ స్కూల్ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఐదు రోజుల ఉద్యమ కార్యచరణలో భాగంగా రెండవ రోజు నిరసన చేపట్టారు ఉపాధ్యాయులు అందరూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మోడల్ స్కూల్స్ ను ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్యాశాఖ లో విలీనం చేసి ఉపాధ్యాయులకు 010 పద్ధతి ద్వారా నెలవారి వేతనాలు చెల్లిస్తున్నారు ఆ విధంగా తెలంగాణలో మోడల్ స్కూల్స్ ను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి 010 వేతనాలు చెల్లించాలని, మరణించిన కుటుంబాలలో అర్హులైన వారికి కార్యం నియామకాలు కల్పించాలని, సర్వీస్ నిబంధన ప్రకారం పదోన్నతులు కల్పించాలని, టీజీటీ ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం నోషనల్ ప్రయోజనాలు మంజూరు చేయాలని , మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించి తక్షణమే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు ఎమ్మెస్ జేఏసీ ప్రకటించిన ఐదు రోజుల కార్యక్రమాలలో భాగంగా తదుపరి దశలో మండల జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులను అధికారులను కలిసి సమస్యలపై విజ్ఞప్తి చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలిత రాజశ్రీ శ్రీధర్ రెడ్డి గంగరాజు రమేష్ ఉమారాణి హైమావతి కళ్యాణ్ సింగ్ నరసింహులు స్రవంతి తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్