జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 11-11-2026 పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. పరాభవనమ సంవత్సరం దక్షిణాయనం కార్తీక మాసం మొదటి బుధవారం సందర్భంగా ఆలయంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ కార్యక్రమం నిర్వహించారు. మొదటిసారి మాల ధరించిన స్వాములకు గురు స్వాములు ఎలా ఉండాలి విధి విధానాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పెబ్బేరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన స్వాములు దాదాపు 125 మంది అయ్యప్ప భక్తులు గురుస్వాముల సమక్షంలో పవిత్రమైన అయ్యప్ప మాలధారణ స్వీకరించి మండల దీక్షను ప్రారంభించారు. స్వామియే శరణం అయ్యప్ప అనే శరణుఘోషతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో పులకించిపోయింది. భక్తులు నియమ నిష్ఠలతో 41 రోజుల మండల దీక్షను ఆచరించి అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.