తెలంగాణ

కార్తీక మాసం తొలి బుధవారం. వివేకానంద నగర్ అయ్యప్ప ఆలయంలో భక్తుల సందడి

కార్తీక మాసం తొలి బుధవారం. వివేకానంద నగర్ అయ్యప్ప ఆలయంలో భక్తుల సందడి

మాలధారణలతో కిటకిటలాడిన ఆలయం జనం న్యూస్ నవంబర్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కార్తీక మాసం ప్రారంభం కావడంతో అయ్యప్ప స్వాముల దీక్షల సందడి మొదలైంది. కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో కార్తీక మాసం తొలి బుధవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అయ్యప్ప మాలధారణ చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణం స్వామి శరణుఘోషతో మార్మోగింది. భక్తులతో దేవాలయం కిటకిటలాడింది. ఈ ఆలయాన్ని కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగరావు స్వయంగా నిర్మించి భక్తులకు అంకితం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అయ్యప్ప స్వాముల దీక్షలకు ఈ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. దీక్ష చేపట్టిన స్వాములకు వసతి సౌకర్యం కల్పించడంతో పాటు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు అందిస్తూ ఆలయం విశేష గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం అయ్యప్ప దీక్షా కాలంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 16వ తేదీ నుంచి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ప్రారంభం కానుంది. అదేవిధంగా ప్రతిరోజూ సాయంత్రం పడిపూజ అనంతరం అయ్యప్ప స్వాములకు అల్పాహారం అందించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమాలు అయ్యప్ప స్వాములతో పాటు పరిసర కాలనీల ప్రజల మన్ననలు పొందుతున్నాయి. భక్తి, సేవాభావం, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తున్న వివేకానంద నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల భక్తులకు విశేష ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది.

ఇ-పేపర్