జనం న్యూస్ – నవంబర్ 11: జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎల్ఐసీ శాఖ కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీ రాంకిషన్ సార్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను ఎల్ఐసీ ఏజెంట్లు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దంపతులకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం కేక్ కట్ చేయించి ఆనందోత్సాహాల మధ్య శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా లియాఫీ కార్యదర్శి మర్రి భాస్కర్ మాట్లాడుతూ. బ్రాంచ్ మేనేజర్ రాంకిషన్ ఎల్లప్పుడూ ఏజెంట్లకు, సిబ్బందికి అందుబాటులో ఉంటూ అందరితో ఆప్యాయంగా మెలుగుతారని కొనియాడారు. ఆయన దంపతులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని ఆకాంక్షించారు. సంస్థ పట్ల మేనేజర్‌కు ఉన్న అంకితభావం అభినందనీయం: సతీమణి బ్రాంచ్ మేనేజర్ సతీమణి మాట్లాడుతూ.. తన భర్త ఎప్పుడూ ఎల్ఐసీ సంస్థ గురించే ఆలోచిస్తుంటారని, “నాకు అన్నం పెట్టే సంస్థకు నేను ఏమి చేస్తే రుణం తీర్చుకోగలను?” అని తరచూ తనతో అంటుంటారని భావోద్వేగంగా తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం ఆయన పడే తపన, అంకితభావం ఎంతో గొప్పవని పేర్కొన్నారు. తాను కూడా ఇంటి నుంచి తన వంతు సహకారం అందిస్తానని, ఏజెంట్లందరూ మంచి వ్యాపారం సాధించి మెట్పల్లి శాఖను డివిజన్ స్థాయిలో మొదటి వరుసలో నిలపాలని ఆకాంక్షించారు. మెట్‌పల్లిని ‘మెరిట్ పల్లి’ స్థాయికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి చేతుల్లోనే ఉందని, అందరూ పట్టుదలతో పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఏజెంట్ల సహకారంతో శాఖను ప్రథమ స్థానంలో నిలపాలి: బీఎం రాంకిషన్అ నంతరం బ్రాంచ్ మేనేజర్ రాంకిషన్ మాట్లాడుతూ. ఏజెంట్లు తనకు ఇంతటి ఆనందకరమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తారని ఊహించలేదని, అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎల్లప్పుడూ ఏజెంట్లకు అందుబాటులో ఉంటానని, అవసరమైన సహాయ సహకారాలు తన నుంచి పొందుతూ మంచి వ్యాపారం సాధించాలని కోరారు. మనందరి సమష్టి కృషితో మెట్పల్లి శాఖను డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. కార్యాలయంలో అధికారులు, సహాయక సిబ్బంది నుంచి పూర్తి సహకారం అందుతోందని, ఏజెంట్ల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. కాబట్టి ఏజెంట్లందరూ ఆలస్యం చేయకుండా వ్యాపారంపై దృష్టి సారించాలని కోరారు. లియాఫీ అధ్యక్షులు నాగభూషణం మాట్లాడుతూ. మెట్పల్లి ఎల్ఐసీ శాఖలో తొలిసారిగా బ్రాంచ్ మేనేజర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దంపతులు ఇలాంటి వేడుకలను మరెన్నో జరుపుకుంటూ నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ ఏజెంట్లు, సిబ్బంది పాల్గొని బ్రాంచ్ మేనేజర్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.