ఆంధ్రప్రదేశ్

గోపాల గోపాల హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

గోపాల గోపాల హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ నవంబర్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పాపారాయుడు నగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన గోపాల గోపాల హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. హోటల్ నిర్వాహకులు డి. భాస్కర రెడ్డి, భాస్కరరావు, విజయ్ ఆహ్వానం మేరకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రిబ్బన్ కట్ చేసి హోటల్‌ను లాంఛనంగా ప్రారంభించారు. హోటల్ నిర్వాహకులు భాస్కర రెడ్డి, భాస్కరరావు, విజయ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వడ్డేపల్లి రాజేశ్వరరావు కి నిర్వాహకులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ… వ్యాపార రంగంలో కొత్తగా అడుగుపెట్టడం అభినందనీయమని పేర్కొంటూ, నూతనంగా హోటల్‌ను ప్రారంభించిన నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హోటల్ నిర్వహణలో నాణ్యమైన ఆహారాన్ని, మంచి రుచిని, పరిశుభ్రమైన వాతావరణాన్ని వినియోగదారులకు అందిస్తూ ప్రజల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. ఈ హోటల్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ నిర్వాహకులకు మంచి పేరు, ఆర్థిక అభివృద్ధి తీసుకురావాలని, భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, పాపారాయుడు నగర్ కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్