జనం న్యూస్ నవంబర్ 11 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలోని హేమదుర్గ భవన్లో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న పురస్కార గ్రహీత మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగ కూకట్ పల్లి నియోజకవర్గం మైనారిటీ వర్కింగ్ చైర్మన్ షేక్ నవాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పాల్గొని మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగ బండి రమేష్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయమని, దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి పునాదులు వేశారని కొనియాడారు. దేశ సమైక్యత, మత సామరస్యం, విద్యా ప్రగతి కోసం ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వం, సోదరభావం, బండి విద్యాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గాలి బాలాజీ , లక్ష్మయ్య, పుష్ప రెడ్డి ,పాషా ,సల్మాన్ ,లక్ష్మణ్ గౌడ్, జమీర్, ఎజాజ్, సల్మాన్ , రమణ, మస్కుదలి, ప్రసన్నకుమార్, కిట్టు ,సుధాకర్ ,ప్రకాష్, ముదిరాజ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.