ఆంధ్రప్రదేశ్

తామర చెరువులో ఎంపీటీసీ పిఎస్ఎన్ రాజుకు ఘన సత్కారం

తామర చెరువులో ఎంపీటీసీ పిఎస్ఎన్ రాజుకు ఘన సత్కారం

జనం న్యూస్ నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
కాట్రేనికోన 1 ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన పిఎస్ఎన్ రాజును మంగళవారం రాత్రి ఘనంగా సన్మానించారు. తామర చెరువులో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రజా సమస్యలపై స్పందించే వ్యక్తులకు విజయం వరిస్తుందని మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు అన్నారు. పిఎస్ఎన్ రాజు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని బాధ్యతగా తీసుకుని మరింత సేవ చేస్తానని పిఎస్ఎన్ రాజు తెలిపారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించి, అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం టీడీపీ అభిమానులు పిఎస్ఎన్ రాజును శాలువా కప్పి సన్మానించారు. అదే విధంగా పార్టీకి ఎంతో కృషి చేసినందుకు పిఎస్ఎన్ రాజుతో పాటు మత్స్యశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, చేకూరి కృష్ణంరాజును కూడా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో విత్తనాల బుజ్జి, వాసంశెట్టి రాజేశ్వరరావు, వంగ దుర్గ బాబు, మోకా అప్పాజీ, సత్తాల ప్రసాద్, కముజు లక్ష్మణ్, సుంకర వెంకటరమణ, కముజు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్