విద్యా వికాసానికి ఆజాద్ సేవలు చిరస్మరణీయం: స్టేట్ వక్ఫ్ బోర్డు సభ్యులు హాజీ మకర హుస్సేన్జ నం న్యూస్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం 15వ వార్డులోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ పాఠశాలలో కోనసీమ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బషీర్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 139వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన స్టేట్ వక్ఫ్ బోర్డు సభ్యులు హాజీ మకర హుస్సేన్.. ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ విద్యా వికాసానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన విశేష కృషి దేశ చరిత్రలో చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 28 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు, అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బోనం సత్తిబాబు,15వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దండుమేను రూపేష్, స్థానిక నాయకులు కట్టా నాని, జనసేన నాయకులు మొహమ్మద్ మహబూబ్ షరీఫ్, టీడీపీ నాయకులు సాధాక్ హుస్సేన్, భాషా జాన్, అక్బర్ అలీ, జనసేన నాయకులు మొటూరి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు కర్రీ చిట్టిబాబు,అలీ తదితరులు పాల్గొన్నారు.