వైరల్ వార్తలు

చిట్కుల్ గ్రామంలో నూతన గురు మందిరం ప్రారంభోత్సవం

చిట్కుల్ గ్రామంలో నూతన గురు మందిరం ప్రారంభోత్సవం

శ్రీశ్రీశ్రీ మాణిక్యమాంబ సమేత శ్రీ సమరసానంద కోట్ల నల్ల యార్యుల నూతన గురు మందిరం

జనం న్యూస్ నవంబర్ 12 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలో గురువారం ఉదయం నూతన గురు మందిరం ప్రారంభోత్సవం జరుగుతుంది ఉదయం 5 గంటలకు నూతన గురు మందిరం ప్రవేశము శ్రీవారి ఛాయాపటము ప్రతిష్టాపన శ్రీవారి పాదుక ప్రతిష్టాపన లఘు పూజ గురు గీతా పారాయణం దైవ యజ్ఞం నగర సంకీర్తన జండా ప్రతిష్టాపన షోడశోపచార మహా పూజ విశిష్ట అతిథులు మాధవానంద సరస్వతి స్వామి రంగంపేట మహేశ్వర శర్మ సిద్ధాంతి పసల్వాది సదాశివశర్మ మదారము మోహన్ నాయక్ స్వామి గౌతాపూర్ సర్వేశ్వర స్వామి దుద్యాల వారు నూతన గురు మందిర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు శ్రీశ్రీశ్రీ మాణిక్యమాంబ సమేత శ్రీ సమరసానంద కోట్ల నల్ల ఆర్యుల వారి నూతన గురు మందిర ప్రారంభోత్సవానికి గురువారము ఉదయము ఐదు గంటల 30 నిమిషాలకు నూతన గురువు మందిరము ప్రారంభించడానికి వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో గురుభక్తులందరూ గ్రామ పెద్దలు పరిసర గ్రామాల గురుభక్తులు విచ్చేస్తున్నారు ఆశ్రమ నిర్మాణ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షులు పెంటారెడ్డి భూమిరెడ్డి కార్యదర్శులు మల్లేశం మేరు డాక్టర్ సత్యం బీర్ల కిష్టయ్య ఆశ్రమ నిర్మాణ కమిటీ గురు శిష్య బృందం ఈ కార్యక్రమంలో ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు ముఖ్య కార్యక్రమాలు వివిధ గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం తదనంతరం వీధుల గుండా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు పల్లకి సేవ వెంబడి భజన భక్తులు గురు బృందం శిష్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారునూతన గురు మందిరం ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నా తదనంతరం భోజన ప్రసాదాలు స్వీకరించారు

ఇ-పేపర్