జనం న్యూస్ నవంబర్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి పోలియో నిర్మూలనే లక్ష్యంగా సబ్ నేషనల్ ఇమ్యునైజేషన్ డే – 2026లో భాగంగా నేడు పాపిరెడ్డి నగర్ బస్తీలోపల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వెంకటేశ్వర నగర్ కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇతర బస్తీ నాయకులతో కలిసి పాపిరెడ్డి నగర్ శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ శివాలయం ఆవరణలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు పోలియో టీకాలు ఎంతో కీలకమని, ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించి, పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ సీనియర్ నాయకులు డాకూరి అక్కిరెడ్డి, మాయ బాల నరసయ్య,ఎడ్ల సంపత్ రెడ్డి,బి వి కే శ్రీకాంత్, ధర్మ వెంకట్ రెడ్డి,శంకర్ రెడ్డి,రాజు మరియు ఆశ వర్కర్లు జ్యోతి,అపర్ణ,శ్రీలత,సరిత,విజయ లక్ష్మీ ,సబిత తదిరులు పాల్గొన్నారు.