ఆంధ్రప్రదేశ్

సిహెచ్ గున్నేపల్లిలో ఇంటింటా ప్రచారం – ఉంగరం గుర్తుకే ఓటు వేసి వెంకట మంగతాయారును గెలిపించండి

సిహెచ్ గున్నేపల్లిలో ఇంటింటా ప్రచారం – ఉంగరం గుర్తుకే ఓటు వేసి వెంకట మంగతాయారును గెలిపించండి

జనం న్యూస్ నవంబర్ 24 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి గొలకోటి సూర్య వెంకట మంగతాయారు పాల్గొని ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుని ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఆమె భర్త, ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొలకోటి వెంకటరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో వార్డు సభ్యులు గాలి దేవర గంగాధర్, శివాజీ, గాలి దేవర మంగతాయారు, గొలకోటి కాశి, గనిశెట్టి లక్ష్మి, భారతీయ జనతా పార్టీ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ, మట్ట సూరిబాబు, సఖి రెడ్డి శ్రీనివాస్, గనిశెట్టి బాబీ మాస్టర్, యనమదల వెంకటరమణ, గొలకోటి సాయిబాబు, గొలకోటి వెంకటేశ్వరరావు, రాయపు రెడ్డి భైరవమూర్తి, బొంతు కనకారావు, జనిపల్లి శ్రీనివాసరావు, సన్నిధి రాజు, వీరభద్ర శర్మ, గ్రామ ఓటర్లు తదితరులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి, తాగునీరు, రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని సర్పంచ్ అభ్యర్థి వెంకట మంగతాయారు ఓటర్లకు హామీ ఇచ్చారు.

ఇ-పేపర్