జనం న్యూస్ నవంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఉదయం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ ప్రతిష్టను ప్రజల్లో పెంపొందించడం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం వంటి అంశాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్తులో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత కల్పించడం తదితర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పలు సూచనలు, సలహాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు. ఆయన అందించిన విలువైన సూచనలు, సలహాలకు కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు డాక్టర్ పి. నాగిరెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు తూము వేణు పాల్గొన్నారు.