ఆంధ్రప్రదేశ్

ఇందిరమ్మ కుటుంబ బీమా, రైతు బీమాపై ప్రజల్లో అయోమయం.

ఇందిరమ్మ కుటుంబ బీమా, రైతు బీమాపై ప్రజల్లో అయోమయం.

జనం న్యూస్ నవంబర్ 24 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం, రైతు బీమా పథకాల అమలుపై ప్రజల్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీ జె పీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయరాకుల మొగిలి విమర్శించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు ఈ రెండు పథకాల ప్రయోజనాలు వర్తిస్తాయా? ఒక్కొక్కరికి ఒక్కో పథకం వర్తించే అవకాశం ఉందా? అనే సందేహాలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం, పథకాల నిబంధనలపై స్పష్టత ఇవ్వకుండా ప్రజలను గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రచారం చేసుకోవడం కాకుండా, వాటి అమలులో పారదర్శకత చూపించి ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు అర్హులైతే ఒకరికి ఇందిరమ్మ కుటుంబ బీమా, మరొకరికి రైతు బీమా వర్తిస్తుందా? రెండు పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎలాంటి అర్హతలు, నిబంధనలు ఉంటాయి? అనే విషయాలను ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సి ఉందన్నారు. కానీ ఈ అంశంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ పథకాలపై అనిశ్చితి నెలకొంటోందని విమర్శించారు. ప్రజల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం వెంటనే ఈ రెండు బీమా పథకాలపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని, అర్హులైన కుటుంబాలకు బీమా ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని బీ జె పీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాయరాకుల మొగిలి డిమాండ్ చేశారు.

ఇ-పేపర్