జనం న్యూస్ నవంబర్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీమతి మాగాపు దుర్గా జగదీశ్వరి దేవి లోవరాజు ఈరోజు ఉదయం నుండి బాబా నగర్ కాలనీ చింతాకుల వారి పేట వార్డు నెంబర్లతో కలిసి గ్రామంలో ఇంటింటికి వెళ్లి మంచం గుర్తును ప్రతి ఒక్కరికి చూపిస్తూ ప్రతి ఒక్కరూ మంచం గుర్తుపై ఓటు వేసి అఖండ విజయంతో గెలిపించాలని కోరుతూ నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అంటూ మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే నా ధ్యేయం అంటూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి రాత్రింబవళ్లు కష్టపడి కృషి చేస్తానన్నారు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా పయనిస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు మాగాపుకు పూర్తి మద్దతును తెలుపుతూ ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు.