రుద్రూర్, పయనించే సూర్యుడు నవంబర్ 23 న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన గౌడ సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా గెలుపొందిన మీసాల గోవింద గౌడ్, కార్యవర్గ సభ్యులు శ్రీధర్ గౌడ్, రుద్రూర్ గ్రామ సీనియర్ నాయకులు, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము ఆధ్వర్యంలో శనివారం గౌడ సంఘం సభ్యులు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు మీసాల గోవింద గౌడ్ మాట్లాడుతూ..గౌడ సంఘం అభివృద్ధి కోసం బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అందించిన సహాయ సహకారాలు ఎనలేనివి అని కొనియాడారు. వారికి గౌడ సంఘం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా గౌడ సంఘానికి వారి అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని పోచారం భాస్కర్ రెడ్డిని కోరారు. సంఘం బలంగా ఉండాలంటే పెద్దల ఆశీర్వాదం, నాయకుల అండదండలు అవసరం అని అవి మీ ద్వార మాకు ఎప్పుడూ ఉండాలి అని పోచారం భాస్కర్ రెడ్డిని కోరారు. పోచారం భాస్కర్ రెడ్డిని కలిసిన వారిలో కన్నే రవి, గౌడ సంఘం సభ్యులు జై శంకర్ గౌడ్, రాజా గౌడ్, బాలరాజు గౌడ్, రామా గౌడ్, గౌడ సంఘం సభ్యులు ఉన్నారు.