జనం న్యూస్ నవంబర్ 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ పథకం నల్ల గుంట చెరువులోపనులు జరుగుతున్న ప్రాంతంలో కూలీలకు సంబంధించిన గడ్డపార, పార, డబ్బా తదితర పనిముట్లను గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు బీఎస్ఎస్ మండల అధ్యక్షుడు మరపే ల్లి సుధాకర్ తెలిపారు. కూలీలు తమ పనుల కోసం ఉపయోగించుకునే పనిముట్లు చోరీకి గురికావడం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, చోరీకి పాల్పడిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ సదయ్య, టెక్నికల్ అసిస్టెంట్ రామన్న వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి, కూలీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూలీలకు చెందిన పనిముట్ల భద్రతకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బీ ఎస్ ఎస్ మండలం అధ్యక్షులు మారపెల్లి సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు కోడెపాక బాబు మారపల్లి ఎల్లయ్య పసునూటీ రమేష్ మారేపల్లి మోహన్ కోడెపాక స్వరూప దైనంపల్లి సాంబయ్య సారయ్య నడిగోట్టు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.