జనం న్యూస్ 23 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ఉ దయ్ అసోసియేషన్ మరియు శారీరక దివ్యాంగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి శృతి ఓజా ని కలిసి వినతిపత్రం అందజేశాము.ప్రధానంగా చర్చించిన అంశాలు: ఉద్యోగుల సమస్యలు మినహాయింపు: గతంలో ఇచ్చిన దివ్యాంగ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరియు వారికి హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరాము. సెక్రటేరియట్ & మున్సిపల్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు: సెక్రటేరియట్‌లోని బ్యాక్లాగ్ ఉద్యోగాల వెరిఫికేషన్ పూర్తి చేయాలని, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్ బ్యాక్లాగ్ పోస్టుల వెరిఫికేషన్‌పై ప్రత్యేక ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశాము. డిసెంబర్ 3 వేడుకలకు సీఎం ఆహ్వానం: రాబోయే డిసెంబర్ 3 (ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం) రాష్ట్ర స్థాయి వేడుకలకు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్రత్యేకంగా కోరాము.ఈ అంశాలపై సెక్రటరీ సానుకూలంగా స్పందించారు. నిరుద్యోగ సమస్యలు మరియు శారీరక దివ్యాంగుల ఉద్యోగ సమస్యల అన్ని త్వరలో నే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఉదయ్ అసోసియేషన్ శారీరక దివ్యాంగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ.