ఆంధ్రప్రదేశ్

గోకరాజునల్లి బొయిన వారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దబ్బకూటి బళ్ళమ్మ అశోక్ కుమార్ నామినేషన్

గోకరాజునల్లి బొయిన వారిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా దబ్బకూటి బళ్ళమ్మ అశోక్ కుమార్ నామినేషన్

భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు. గ్రామ అభివృద్ధే లక్ష్యమని వెల్లడి జనం న్యూస్ | నవంబర్ 23 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి బాపట్ల నియోజకవర్గం, పిట్టలవానిపాలెం మండలంలోని గోకరాజు నల్లి బోయిన వారి పాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దబ్బకూటి బళ్ళమ్మ కాశి యాదవ్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం 11 గంటలకు గోకరాజు నల్లిబొయిన వారి పాలెం గ్రామం నుంచి పిట్టలవానిపాలెం వరకు పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్ర వాహనాలతో మద్దతుదారులు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఈ సందర్భంగా దబ్బకూటి బళ్ళమ్మ కాశి యాదవ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆదరాభిమానాలతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, బస్తీ దవాఖాన ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని పేర్కొన్నారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి సమస్య పరిష్కారానికి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని ఆమె స్పష్టం చేశారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇ-పేపర్