ఆంధ్రప్రదేశ్

అనాతవరంలో టీడీపీలోకి భారీ చేరికలు – గుత్తుల సాయి సమక్షంలో కండువాలు కప్పిన నేతలు

అనాతవరంలో టీడీపీలోకి భారీ చేరికలు – గుత్తుల సాయి సమక్షంలో కండువాలు కప్పిన నేతలు

జనం న్యూస్ నవంబర్ 25 ముమ్మడివరం ప్రతినిధి , ముమ్మిడివరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం అనాతవరం గ్రామంలో మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గుత్తుల సాయి సమక్షంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా గుత్తుల సాయి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని అన్నారు. టీడీపీలో చేరిన ప్రతి ఒక్కరికీ తగిన గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ బలోపేతానికి కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీడీపీలో చేరామని తెలిపారు. పార్టీలో చేరిన వారికి గుత్తుల సాయి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్