కూటమి కార్యకర్తలు కలిసి పనిచేయాలి

August 7, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ఎ మ్మెల్యే విజయ్ కుమార్ అనకాపల్లి జిల్లా ఎలమంచిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కూటమి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కార్యకర్తలు ఆధిపత్య పోరును పక్కనపెట్టి ఐక్యంగా పనిచేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కూటమి శ్రేణులు కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీని సమష్టిగా ఎదుర్కొని కూటమి విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ , ప్రగడ నాగేశ్వరరావు, కూటమి నాయకులు,ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper