వివేకానందలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

August 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్:15 ఆగస్ట్ శనివారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ భారత్ నగర్ లోని వివేకానంద విద్యాలయము లో భారత్ నగర్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ యాళ్ళ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలను కొనియాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, దేశ ప్రగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో దేశభక్తిని, సేవాభావాన్ని పెంపొందించడమే తమ పాఠశాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గేయాలు, సాంస్కృతిక నృత్యాలు, మరియు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించు కుని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ లిఖిత ఉపాధ్యాయినులు, రత్నమాల, భాగ్యమ్మ, కృష్ణవేణి,ఫిర్దోజ్, ఫరిస,మానుష , విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper