గినియార్పల్లిలో ఘనంగా ఆగస్టు 15 జెండా కార్యక్రమం

August 15, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం ఆగస్టు 15. 08. 2026 జహీరాబాద్ నియోజకవర్గం జారా సంగం మండలం గినియార్పల్లి గ్రామంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కుమ్మరి రాజేశ్వరి గోపాల్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తిని చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజేశ్వరి గోపాల్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, మహిళలు తదితరులు పాల్గొని జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. గ్రామంలో ఆగస్టు 15 వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి.

🌐 Select Language:
📰 ePaper