గట్టుపల్లి గ్రామంలో కోట మైసమ్మ తల్లి గుడి పునర్నిర్మాణ కార్యక్రమం
జనం న్యూస్ 16 ఆగస్టు వికారాబాద్ జిల్లా :- పూడూర్ మండలం గట్టుపల్లి గ్రామంలో కోట మైసమ్మ తల్లి గుడి పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టారు. గ్రామస్థుల సహకారంతో ఆలయ పరిసరాలను శుభ్రం చేసి, పాత నిర్మాణానికి సంబంధించిన రాళ్లు, ఇతర అవశేషాలను తొలగించే పనులు ప్రారంభించారు. ఆలయ పునర్నిర్మాణంతో మైసమ్మ తల్లి ఆలయానికి నూతన రూపు తీసుకురావడంతో పాటు, గ్రామ ప్రజలకు మరింత సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానికులు, యువకులు పాల్గొన్నారు.