వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణమాస బోనాల ఉత్సవాలు
జనం న్యూస్, ఆగస్టు 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి మూసాపేట్‌లోని బండ మైసమ్మ ఆలయంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాస బోనాల పండుగ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాశెట్టి నర్సింగ్ రావు, రాష్ట్ర బీసీ నాయకులు, సీనియర్ జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, కూకట్పల్లి జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, జిల్లా గోపాల్, ఐలయ్య యాదవ్, గోకర్ల లక్ష్మీనారాయణ, పి. నరసింహ, పి. బంధప్ప, మొక్కల రాజు, వి. నారాయణ చారి, వ్యాధిలాల్, పి. మహేష్, సత్యనారాయణ, నాగేష్, వెంకటేష్, సన్యాసిరావు, వడ్డెర నర్సింగ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని బండ మైసమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులు, నాయకులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తులతో పండుగ వాతావరణం నెలకొంది.