జనం న్యూస్ 15 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలో మంగళవారం రోజున ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో జాతీయ మహాసభలలో విజయవంతం చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్లెపు అడవయ్య బెజడి కుమార్ పిలుపునిచ్చారు అనంతరం మాట్లాడుతూ రైతాంగాన్ని సమీకరించి, రైతుల సమస్యలపై దేశవ్యాప్త పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ ఆలేరులో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కె.ఎం.ఎస్. జిల్లా గౌరవాధ్యక్షులు మామిడాల సోమయ్య, ఉపాధ్యక్షులు చిరబోయిన రాజయ్య, ఇక్కిరి సహదేవ్, సహాయ కార్యదర్శి మామిడాల బాలమల్లేష్, తమ్మడి అంజయ్య, పాకాల సరిత, రాఘవ రెడ్డి, గోపాల్ రెడ్డి, మేకల వెంకటేష్, మార్కొండయ్య , పాకాల నరేష్, బాల్ రెడ్డి,ఇక్కిరి శ్రీనివాస్, తదితర నాయకులు పాల్గొన్నారు