ఆంధ్రప్రదేశ్

ఆడపూరు గురుకుల పాఠశాలలోఎంపీపీ మేడ ఆకస్మిక తనిఖీ

ఆడపూరు గురుకుల పాఠశాలలోఎంపీపీ మేడ ఆకస్మిక తనిఖీ

సబ్ టైటిల్ పరిశుభ్రత,భోజనం, వాష్‌రూమ్‌లనిర్వహణపై పరిశీలన:-మేడ విజయ భాస్కర్ రెడ్డి.

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా సెప్టెంబర్ 15: నందలూరు మండలంలోని ఆడపూరు ఎస్సీ గురుకుల పాఠశాల, హాస్టల్‌ను ఎంపీపీ మేడ విజయభాస్కర్‌రెడ్డి, ఎంపీడీవో కేఆర్‌ఎం ప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల ప్రాంగణం, హాస్టల్ పరిసరాలు వాష్‌రూమ్‌లు,విద్యార్థుల వసతి గదులు,భోజన సదుపాయాలను పరిశీలించి నిర్వహణ తీరుపై ఆరా తీశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మేడవిజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గురుకుల పాఠ శాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వసతులు, పరిశుభ్రమైన వాతావరణం నాణ్యమైన పోషకాహారం అందించడం అత్యంత ముఖ్యమైన విషయం హాస్టల్‌ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకు పోవడం,వాష్‌రూమ్‌ల నిర్వహణలో లోపాలు కనిపించ డం సరికాదని అన్నారు. విద్యార్థులకు అందించే భోజనం విష యంలోనూ మెనూ, నాణ్యత, పరిమాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని. పిల్లల ఆరోగ్యం, సంక్షే మం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సంబంధిత సిబ్బంది పరిశుభ్రత, భోజనం,వసతి సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలి అని సిబ్బందికి తెలిపారు గురు కుల పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు విద్యా ర్థులకు పూర్తిస్థాయిలో అందు తున్నాయా? అనే అంశంపై అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు విద్యార్థులకు అందుతున్న భోజనం మెనూ ప్రకారం వారానికి రెండుసార్లు చికెన్‌ అందిస్తున్నప్పటికీ, ఒక్కో విద్యార్థికి సుమారు మూడు చిన్న ముక్కలు మాత్రమే అందు తున్నాయని సిబ్బందిపై మండి పడ్డారు. ముఖ్యంగా హాస్టల్‌ పరిశుభ్రత, వాష్‌రూమ్‌లనిర్వహణ, తాగునీరు, భోజన పరి మాణం–నాణ్యత, వసతి గదుల నిర్వహణపై పర్యవేక్షణ మరింత పెంచాలని హాస్టల్ సిబ్బందికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యులు కరిముల్లాఖాన్, తుమ్మల శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్