జనం న్యూస్ సెప్టెంబర్ 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గణేష్ నవరాత్రుల సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నిన్న మూసాపేట్ డివిజన్ మరియు కైతలాపూర్ డివిజన్‌లో గల్లీ గల్లీలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను నిర్వాహకుల ఆహ్వానం మేరకు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా మండపాల్లో కొలువుదీరిన విఘ్నేశ్వరుని దివ్య దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం మండప నిర్వాహకులు, భక్తులు మరియు యువతతో ఆత్మీయంగా ముచ్చటించారు.
ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛంతో అభినందించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.విఘ్నేశ్వరుని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు ఆకాంక్షించారు.