జనం న్యూస్ నందలూరు కడప సెప్టెంబర్ 20 నందలూరు మండలంలోని గొల్లపల్లి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గొల్లపల్లి గ్రామంలో నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలంపాటలో డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ మాసపల్లివెంకటరమణ కుమారులు,సోదరులైన మాచుపల్లి హరి ప్రసాద్, మాచుపల్లి మహేష్ రూ.1,00,000 కు వినాయకుడి లడ్డూను కైవసం చేసుకున్నారు.ఈ సందర్భంగా మాచుపల్లి సుబ్బరాయుడు,మాచుపల్లి అరుణ మాట్లాడుతూ, వినాయకుడి గొల్లపల్లి గ్రామ ప్రజలందరూ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ఉండాలని, గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మాచుపల్లి కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు.లడ్డూ వేలం పాటలో పాల్గొన్న మాచుపల్లి కుటుంబ సభ్యులను ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, గ్రామస్థులు అభినందించారు.