జనం న్యూస్- సెప్టెంబర్ 21- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిని నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ స్వర్ణ మానస తనిఖీ చేశారు ఆసుపత్రిలోనే వివిధ వార్డులను పరిశీలించిన ఆమె రోగులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ మరియు శానిటైజేషన్ సిబ్బంది హాజరు రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సిబ్బందికి సూచించారు రోగులకు మందుల కొరత లేకుండా చూడాలని అన్నారు, అవార్డులు శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని తెలిపారు, నర్సింగ్ సిబ్బంది విధులలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వైద్యులు సమయపాలన పాటించి రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజా ఆరోగ్యం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత అని, ఏరియా ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని, ఆయన ఆదేశాల మేరకు ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని తెలిపారు.