తెలంగాణ

చెత్త సేకరణకు లారస్ ల్యాబ్స్ అందించిన ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

చెత్త సేకరణకు లారస్ ల్యాబ్స్ అందించిన ట్రాక్టర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్

జనం న్యూస్, సెప్టెంబర్ 21,అచ్యుతాపురం : అచ్యుతాపురం మండలం అచ్యుతాపురం ఎస్‌టిబిఎల్‌లోని ఎమ్మెల్యే నివాసం వద్ద లారస్ ల్యాబొరేటరీస్ సౌజన్యంతో అందించిన తడి చెత్త, పొడి చెత్త సేకరణకు సంబంధించిన రెండు ట్రాక్టర్లను ఎలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం ద్వారా పరిశుభ్రమైన పరిసరాలను ఏర్పాటు చేయడంతో పాటు చెత్తను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రజలు కూడా తమ ఇళ్ల వద్దే తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బందికి అందించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్థానిక సంస్థలతో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.పారిశుధ్య నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తున్న లారస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లారస్ ల్యాబొరేటరీస్ యాజమాన్యం కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్