తెలంగాణ

పేరుకే పార్కు.. నిర్వహణకు దిక్కేది?

పేరుకే పార్కు.. నిర్వహణకు దిక్కేది?

కుప్సింగ్ కుంట పార్కులో పెరిగిన గడ్డి, చెత్తాచెదారం పాడైన ఆట వస్తువులు, డస్ట్‌బిన్లతో ప్రజలకు ఇబ్బందులు

జనం న్యూస్ | సెప్టెంబర్ 21, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి: పట్టణంలోని కుప్సింగ్ కుంట పార్కు నిర్వహణ లోపంతో అధ్వానంగా మారిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్కు పరిసరాల్లో ఏపుగా పెరిగిన గడ్డి, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించకపోవడంతో వాకింగ్‌కు వచ్చే వారు, పిల్లలు, పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.పార్కులో పలు చోట్ల ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు కనిపిస్తున్నప్పటికీ .. వాటి వెనుక ఉన్న నిర్వహణ మాత్రం అంతంతమాత్రంగానే ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. డస్ట్‌బిన్లు పాడైపోవడం, పచ్చదనం సక్రమంగా నిర్వహించకపోవడం, పిల్లల ఆట వస్తువులు దెబ్బతినడం వంటి సమస్యలు పార్కు నిర్వహణ తీరును స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు.గడ్డి తొలగించి.. అక్కడే వ్యర్థాల కుప్పలుపార్కులో పెరిగిన గడ్డిని తొలగించినప్పటికీ, ఆ వ్యర్థాలను ప్రాంగణం నుంచి బయటకు తరలించకుండా అక్కడే కుప్పలుగా వేయడం విమర్శలకు దారితీస్తోంది. ఎండిపోయిన ఆకులు, కొమ్మలు, చెత్త ఒకచోట పేరుకుపోవడంతో పార్కు పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. పార్కులో కూర్చునేందుకు ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు సైతం కొన్ని చోట్ల విరిగిపోయి నిరుపయోగంగా కనిపిస్తున్నాయి.దెబ్బతిన్న ఆట వస్తువులతో ప్రమాదం పొంచి ఉందంటున్న తల్లిదండ్రులుపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువుల్లో కొన్ని దెబ్బతిన్న స్థితిలో ఉండటంతో చిన్నారులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు వినియోగించే ఈ పార్కులో కనీస సౌకర్యాలు, పరిశుభ్రత, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.అధికారులు స్పందించాలిపేరుకే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం కాకుండా.. వాటి నిర్వహణతో పాటు పార్కులో పరిశుభ్రత, పచ్చదనం, డస్ట్‌బిన్లు, కూర్చునే బల్లలు, పిల్లల ఆట వస్తువుల భద్రతపై అధికారులు దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. కుప్సింగ్ కుంట పార్కును అధికారులు వెంటనే పరిశీలించి, పెరిగిన గడ్డిని తొలగించి, పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించడంతో పాటు పాడైన డస్ట్‌బిన్లు, ఆట వస్తువులు, సిమెంట్ బల్లలకు మరమ్మతులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించాల్సిన పార్కును పరిశుభ్రంగా, సురక్షితంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.

ఇ-పేపర్