ఆంధ్రప్రదేశ్

యువ నాయకుడు చంద్రకాంతరావుకు ఘన సన్మానం.జన్మదిన వేడుకల్లో శాలువాతో సత్కరించిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి

యువ నాయకుడు చంద్రకాంతరావుకు ఘన సన్మానం.జన్మదిన వేడుకల్లో శాలువాతో సత్కరించిన రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి

జనం న్యూస్ సెప్టెంబర్ 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్‌కు చెందిన యువ నాయకుడు టైగర్ ఎన్. చంద్రకాంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనంపల్లి పురేందర్ రెడ్డి చంద్రకాంతరావును శాలువాతో ఘనంగా సన్మానించి, స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనంపల్లి పురేందర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రకాంతరావు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల మధ్య ఎల్లప్పుడూ ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని, ప్రజలతో కలిసిమెలిసి చిరునవ్వుతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరింతగా రాణిస్తూ రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. జన్మదినం సందర్భంగా పలువురు నాయకులు, అభిమానులు, స్నేహితులు చంద్రకాంతరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, సూర్యనారాయణ, నాని, సంజీవరెడ్డి తదితరులు పాల్గొని చంద్రకాంతరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇ-పేపర్