ఆంధ్రప్రదేశ్

బేరం లేని వ్యాపారం. బేరం ఆడలేని వ్యాపార ఒకటే ప్రైవేట్ ఆస్పత్రులు

బేరం లేని వ్యాపారం. బేరం ఆడలేని వ్యాపార ఒకటే ప్రైవేట్ ఆస్పత్రులు

జనం న్యూస్ 22 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్మ నదేశంలో ఏదైనా ఉందంటే అది ప్రైవేటు ఆస్పత్రి మాత్రమే ఆపద సమయంలో పాపం సామాన్యులకు బేరం ఆడాలి రేట్లు చెక్ చేయాలనే ఆలోచన కూడా రాదు ఇదే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు వరం… అందుకే వాళ్ళు చెప్పిందే ధర వాళ్ళు వేసిందే బిల్లు కందిపప్పో పెసర పప్పో అయితే రేటు చెక్ చేస్తాం ఎందుకంటే అస్తమాను కొనుగోలు చేస్తాం కాబట్టి కానీ ఆస్పత్రిలో పరికరాలు రేటు మనకేం తెలుస్తుంది అందుకే వాళ్ళు మెడికల్ బిల్లులో ఎంత కట్టమంటే అంత మారు మాట్లాడకుండా కట్టేసి వస్తున్నాం కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరల దోపిడీ ఎంత దారుణంగా ఉంటుందో బల్లగుద్ది మరీ చెప్పాడు మహారాష్ట్రలోని ఓ అధికారి మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ తుకారాం ముండే ఇటీవల ఒక ఆస్పత్రి ని ఆకస్మికంగా సందర్శించి మెడికల్ బిల్లులు పరిశీలించగా దారుణమైన నిజాలు బయటపడ్డాయి అదేంటో తెలుసుకుంటే మనం కూడా నోరేళ్లబెట్టాల్సిందే సెలైన్ పెట్టేటప్పుడు వాడే ఐవీ సెట్ రేటు ఎంతో తెలుసా కేవలం 11 రూపాయలు కానీ దానిని రూ. 325 కు విక్రయిస్తున్నారు..సిరంజి ధర రూ. 6 కాగా దానిని రూ. 57 అమ్ముతున్నారు..ఇలాంటి ధరల బాదుడు ఇంకా చాలా ఉంది. రూ. 22 విలువైన ఐవీ కెన్యూలా అనే పరికరాన్ని రూ.424 అమ్ముతున్నారు అలాగే రూ. 45 విలువైన నెబులైజర్ మాస్క్ కిట్ ను రూ.650 కి విక్రయిస్తున్నారు..ఇవి ఆస్పత్రుల దోపిడీలో మచ్చుకు కొన్ని మాత్రమే ఇంకా తెలియని ధరలు ఎన్నెన్నో ఉన్నాయి.ఈ ధరలను చూసిన కమిషనర్ తుకారామ్ షాక్ తిన్నారు రోగుల నుంచి ఇంత దారుణంగా దోపిడీ చేస్తున్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై కిందిస్థాయి అధికారులను అడగగా రాష్ట్రంలోనే కాదు సార్ ఈ దేశంలోని చాలా అస్పత్రుల్లో ఇవి సర్వ సాధారణం అని చెప్పారు తక్కువ రేట్లకి వచ్చే పరికరాలను ఇంత లాభానికి అమ్మడంపై వెంటనే ఆయన ఒక నివేదిక రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, అలానే కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు.. ఆస్పత్రుల్లో ధరల దోపిడీ కి కళ్లెం వేయాలని కోరారు ఎమర్జెన్సీ సమయంలో రోగుల బంధువులు ఈ పరికరాల ధరలపై బేరమాడే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొన్నారు. అందుకే డ్రగ్స్ ఆర్డర్ (డి యస్ సి ఓ) 2013 పరిధిలోకి ఈ మెడికల్ పరికరాలను తీసుకొచ్చి ధరలపై పరిమితి విధించాలని కోరుతూ కేంద్ర రసాయనాలు ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శికి తుకారం లేఖ రాశారు. కఠినమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ప్రజలపై పడుతున్న ఈ తీవ్రమైన ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చని స్పష్టం చేశారు మన రాష్ట్రాలలోకూడా ధరలు ఇలానే ఉన్నాయా

ఇ-పేపర్