జనం న్యూస్ 22 సెప్టెంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సింధనూర్ గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు అదేవిధంగా పాఠశాల విద్యార్థులతో మాట్లాడి వారి చదువు మరియు విద్యా బోధన ఎలా ఉంది. ఉపాధ్యాయుల గురించి అడగడం జరిగింది. విద్యార్థులు మాట్లాడుతూ మాకు విద్య బోధన బాగానే చెప్తున్నారు. ఉపాధ్యాయులు మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వేళల సంరక్షిస్తూ మాకు సరైన బోధన అందిస్తున్నారు. కానీ మాకు ఇచ్చిన అటువంటి స్కూల్ యూనిఫామ్ నాణ్యత లేదు అలాగే స్కూల్ స్టడీ స్టడీ మెటీరియల్ లేనందుకు మాకు కొద్దిగా చదువుకోవటానికి ఇబ్బందిగా ఉంది. అంటున్న విద్యార్థులు అదేవిధంగా స్కూల్ హెడ్మాస్టర్ ను కలిసి వివరాలు అడగడం జరిగింది. మా స్కూల్ లో చదువుతున్నటువంటి విద్యార్థులు క్రమశిక్షణతో శ్రద్ధగా విని మంచిగా అర్థం చేసుకొని చదువుతున్నారు. మా స్కూల్ కు కాంపౌండ్ వాల్,80 మీటర్లు బాత్రూంల కొరకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్, ఈ మధ్యకాలంలో నిధులు శాంక్షన్ చేయడం జరిగింది అతి త్వరలో మేము కాంపౌండ్ వాళ్ళు బాత్రూంలు కూడా కంప్లీట్ చేస్తాము అలాగే మా స్కూల్ కి 5 గ్రామాల విద్యార్థులు వస్తున్నారు వారికి సరైన సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు ఉప్పరి గంగాధర్, కు జిల్లా ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ భాస్కర్, చెప్పడం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్, మాట్లాడుతూ మేము జిల్లా కలెక్టర్ గారిని మరొకసారి కలిసి జోగులాంబ గద్వాల జిల్లా డిఇఓ ని కలిసి మన స్కూల్ కు కావలసిన నిధులు అలాగే పిల్లలకు కావలసిన స్టడీ మెటీరియల్ స్కూల్ యూనిఫామ్ గురించి మాట్లాడి అతి త్వరలో ఈ స్కూల్ కి కావాల్సిన అన్ని వసతులు అలాగే వేరే ఊరు నుండి వచ్చే విద్యార్థులకు రవాణా సదుపాయం కల్పించమని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా మా సాయి శక్తుల ప్రయత్నిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. ఉపాధ్యాయులు భద్రయ్య, సీతారాం, వెంకన్న గౌడ్ గ్రామ పెద్దలు వెంకన్న గౌడ్, టైలర్ సిద్ధప్ప, మాజీ వార్డ్ నెంబర్ ఉరుకుందు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.